![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -340 లో..... ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి.. పార్క్ లో ఇచ్చిన ఫ్లవర్ ఏం చేసావని అడుగుతాడు. అక్కడే పారేశానని ప్రేమ అనగానే.. దీనికి ఏ ఎమోషనల్ ఉండదని తన దగ్గరున్న ఫ్లవర్ ని తనపై విసిరేస్తాడు. ఇదేం ప్రకృతి వైపరిత్యంరా.. నువ్వు ఫ్లవర్ ని తీసుకొని వచ్చావా అని ప్రేమ అంటుంది. ప్రేమ డ్రాయింగ్ వేస్తుంటే ఏం చేస్తున్నావే అని తన చేతిలో ఉన్న పేపర్ లాక్కుంటాడు.
అందులో రెండు కుటుంబాలు కలిసినట్లు ప్రేమ, ధీరజ్ ఇద్దరు చెయ్ పట్టుకొని ఉన్నట్లు ఉంటుంది. అది చూసి.. ఇది ఎప్పటికి జరగదని కోపంగా చెప్తాడు. దాంతో ప్రేమ కోపంగా తను దాచుకున్న ఫ్లవర్ తీసుకొని వెళ్ళి ధీరజ్ కి కోపంగా ఇస్తుంది. అది చూసి ఇది ఎప్పటికి అర్థం కాదని ధీరజ్ అనుకుంటాడు. మరొకవైపు భాగ్యంకి శ్రీవల్లి ఫోన్ చేసి పార్క్ లో జరిగింది చెప్తుంది. ఆ తర్వాత అమూల్య, విశ్వ ఇద్దరు దూరంగా ఉండి సైగ చేసుకోవడం శ్రీవల్లి చూసి టెన్షన్ పడుతుంది. ప్రొద్దున మా అయన వాళ్ళని చూసాడు. ఇప్పుడు ఇంటికి వచ్చాక ఏమంటాడోనని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది.
మరొకవైపు నర్మద, ప్రేమ ఇద్దరు వేదవతి దగ్గరికి వస్తారు. ఇద్దరిపై వేదవతి కోపంగా ఉంటుంది. పేరుకు అత్తాకోడళ్ళు కానీ ఫ్రెండ్స్ అంటారు కానీ మీరు పార్క్ కి వెళ్ళేటప్పుడు కనీసం చెప్పలేదని వేదవతి అనగానే మీరు ముసలివాళ్ళు మీరు వచ్చి ఏం చేస్తారని నర్మద అనగానే వేదవతి కోపంగా రామరాజు దగ్గరికి వెళ్లి ఏవండి మనం సినిమాకి వెళదామని అంటుంది. దానికి రామరాజు సరే అంటాడు. అదంతా చూసి ప్రేమ, నర్మద నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |